Dua In Telugu - తెలుగులో దువా
ఓ అల్లాహ్, ఓ సృష్టికర్త, ఓ విశ్వప్రభువా, ఓ కారుణామయుడా, ఓ కృపాశీలుడా మా ఈ
మొరలను ఆలకించు...🤲
మా ఈ విన్నపాలను స్వీకరించు🤲
మానవాళి పై కరుణించు..🤲
మేము మోయలేని భారాన్ని మాపై వేయకు..🤲
నీ ఆగ్రహం కన్నా , నీ కారుణ్యం అనంతం అని నమ్మే దాసులం మేము.....🤲
మాపై నీ కారుణ్యాన్ని వర్షించు.🤲
కనీసం వ్యాధి సోకిన వారిని పరామర్శించే భాగ్యం కూడా లేదు🤲
చనిపోయిన వారి జనాజా వెంట వెళ్లే అవకాశం లేదు...🤲
బాధలలో ఉన్న బంధువులను ఓదార్చే అవకాశం లేని నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాము 🤲
తల్లి,తండ్రి,భార్య,భర్త,పిల్లలు వంటి బంధాలు అన్ని బంధనలుగా మారిపోయాయి....🤲
ఓ అల్లాహ్ మా పాపాలను మన్నించు...🤲
మేము నిన్ను మరిచి, మా చేతులతో చేసుకున్న పాపాల ఫలితమే మాపై ఈ విపత్తు....🤲
నీ శక్తితో ఈ విపత్తును తొలగించు...🤲
ఓ అల్లాహ్ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిన వారికి స్వర్గాన్ని ప్రసాదించు...🤲
ఇంకా ఈ మహమ్మారి తో పోరాడుతున్న వారికి స్వస్థత చేకూర్చు....🤲
ఆమీన్....
యా రబ్బల్ ఆలమీన్..
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.