*"ﻗُﻠْﻨَﺎ ﻳَٰﻨَﺎﺭُ ﻛُﻮﻧِﻰ ﺑَﺮْﺩًا ﻭَﺳَﻠَٰﻤًﺎ ﻋَﻠَﻰٰٓ ﺇِﺑْﺮَٰﻫِﻴﻢَ.* *"ﻭَﺃَﺭَاﺩُﻭا۟ ﺑِﻪِۦ ﻛَﻴْﺪًا ﻓَﺠَﻌَﻠْﻨَٰﻬُ*
*ٱﻷَْﺧْﺴَﺮِﻳﻦَ*
*"ఓ అగ్నీ! చల్లగా అయిపో ఇబ్రాహీమ్ కు భద్రత అయిపో."వారు ఇబ్రహీం కు కీడు తలపెట్టారు. కానీ మేము వారి కుతంత్రాలను వమ్ము చేసాము.*
📖 దివ్య ఖురాన్
👉🏻సోదరా! ఇన్షాఅల్లాహ్ మనం రేపు *"ఈద్ ఉల్ అజ్హా"* జరుపుకోనున్నాము.
దీనిని కేవలం సంప్రదాయంగా నిర్వహించుకుంటే మనం ఈద్ యొక్క అసలు హక్కును పూర్తిగా నిర్వర్తించనట్టే.
ఈ ఈద్ వెనుక నిక్షిప్తమైన త్యాగధనులు హజ్రత్ ఇబ్రాహీం(అ) గాధనుండి స్ఫూర్తి పొందడం తప్పనిసరి.
🎯అల్లాహ్ ను తన సృష్టికర్తగా గ్రహించటం నుండి, అగ్ని గుండపు పరీక్షకు సిద్దమవ్వటం వరకూ...
🎯తనంతరం కేవలం ధార్మిక బాద్యతను నిర్వర్తించటం కోసం సంతానాన్ని కోరుకోవటం నుండి, లేక లేక కలిగిన ఆ సంతానాన్ని అల్లాహ్ మార్గంలో జిబహ్ చేయటానికి కూడా వెనుకాడని ఆ అచంచల విశ్వాస స్ధాయి వరకూ...
*ఇలా ఇబ్రాహీం(అ) జీవితపు అడుగడుగునా అల్లాహ్ అనుగ్రహమే పరమావధిగా ఏ త్యాగానికైనా సిధ్దమైన ఘటనలు అనేకం.*
⚓నేటి విశ్వాసి ఆ మహోన్నతుని జీవితం నుండి నేర్చుకోవలసిన పాఠాలు అనేకం.
⚓నేడు క్షణక్షణానికి బలహీనపడుతున్న మన విశ్వాసాన్ని స్ధిరపరుచుకోవటానికి ఈ ఈద్ బృహత్తర అవకాశం.
*రండి.....*
బక్రీద్ పండుగను నిజమైన ప్రేరణతో జరుపుకుందాం. మన జీవితాలను సంస్కరించుకుందాం.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*_ఈద్ ఉల్ అద్హా ముబారక్_*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.