Assalamalikum Wr Wbr

TELEGRAM CHANNEL

TELEGRAM CHANNEL
TELEGRAM CHANNEL

Youtube Channel Subscribe Plz

Most Popular Videos

Download Books

Quran-Roman||

Quran Roman English||

TafsirIbnKathir||

Quran-Urdu||

Yaseen Sharif Roman English||

Yaseen With Meaning||

Quran-Hindi||

Quran-English||

Sahih Bukhari||

Yaseen Telugu||

QuranRomanEnglish||

Daily Namaz Suras & Duas

Quran Audio

Subah Ke Azkar||

Thursday, June 21, 2018

Is there a Shiva Linga in Kaba, a shrine of Muslims? Do Muslims worship it?

* ముస్లిముల పుణ్యక్షేత్రమైన కాబాలో శివలింగం ఉందా? ముస్లిములు దానిని పూజిస్తారా?* 
Muslimula puṇyakṣētramaina kābā lō śivaliṅgaṁ undā? Muslimulu dānini pūjistārā?

మక్కా నగరంలో ఉన్న కాబా అనే కట్టడం (‘కాబా’ అంటే చతురస్రాకారం అని అర్థం అంతే) దేవుడికి ప్రార్ధన చెయ్యడం కోసం అబ్రహం (ఇబ్రాహీం) ప్రవక్త పునరుద్ధరించిన మొట్ట మొదటి ప్రార్ధనా మందిరం. ఆ కాబా గోడలో ఉన్న ఒక రాయిని హజ్రె హస్వద్ లేక స్వర్గలోక శిల అంటారు. 

ముస్లిములు భూమి పై ఎక్కడ ఉన్నప్పటికి ప్రార్ధన చేసేటప్పుడు కాబా వున్న దిశలో తిరిగి నమాజు (ప్రార్ధన) చేస్తారు.. ఎందుకంటే ఇది ఆ దైవం యొక్క ఆదేశం..

“(ఓ ప్రవక్తా!) మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్‌లో) మస్జిద్‌ అల్‌-హరామ్‌ (కాబా) వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్‌ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.”  [ఖుర్ఆన్ 2:149]

మక్కాలో కాబా గోడకు వున్న నల్ల రాయి దేవుడు కాదు

మక్కాలో ఉన్న నల్ల రాయి శివలింగమని,  ముస్లిములు దానిని పూజిస్తారనేది కొంతమంది అజ్ఞానంతో చేసే తప్పుడు ప్రచారమే తప్ప మరేమీ కాదు. ప్రపంచంలో ఏ ముస్లిము కూడా మక్కాలో కాబా గోడకు వున్న నల్ల రాయిని ఆరాధించడు.  ఎందుకంటే అల్లాహ్ సృష్టిరాశుల పూజను నిషేధించాడు. చెట్లు, చేమలు, నదులు, భూమి, సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, జంతువులు, రాళ్లు, విగ్రహాలు, పుణ్యపురుషులు, బాబాలు, దైవ ప్రవక్తలు, పౌరాణిక గాధలలోని పాత్రలు మొదలైనవన్నీ సృష్టితాలే., ఇవేమీ సృష్టికర్తకు సమానం కావు. ఎంత గొప్ప మనిషైనా దేవుడితో సమానం కాడు, సృష్టిలోని అంశమే. దేవుడు మనిషి కాజాలడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే..

* సృష్టికర్తను విడచి, సృష్టితాలను పూజించడం ఘోర మార్గ భ్రష్టత్వం, అన్యాయం. *

ఎందుకంటే అల్లాహ్ భూమ్యాకాశాల సృష్టికర్త. సకల జీవుల ప్రభువు అంటే వాటి సృష్టికర్త (Creator), అధిపతి (Owner) మరియు పోషణకర్త (Cherisher or sustainer). తీర్పు దినానికి యజమాని. ఆయనే మనందరినీ సృష్టించి, పోషిస్తున్నాడు మరియు మరణం తరువాత మనందరమూ తీర్పు కోసం ఆయన ముందు నిలవనున్నాము. అందుకని సకల ఆరాధనలకు అర్హత కేవలం ఆ ఒక్క అల్లాహ్ కు మాత్రమే ఉంది. సర్వశక్తిమంతుడైన నిజదేవున్ని విడిచి అనేక బలహీనతలు గల సృష్టి రాశులను ఆరాధించడం దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. ఇదే స్ధితిలో మనషికి మరణం సంభవిస్తే అతడు శాశ్వతమైన నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ శాశ్వతంగా ఉంటాడు.

“ఓ మానవులారా! ఒక ఉదాహరణం ఇవ్వబడుతోంది, దానిని శ్రధ్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను వదలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు. అల్లాహ్‌ ఘనతను వారు గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్‌మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.”  [ఖుర్ఆన్ 22:73-74]

 “..వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని  నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయంచేసేవారు ఎవ్వరూ ఉండరు.” [ఖుర్ఆన్ 5:72]

* మరి ఆ నల్ల రాయి ప్రాముఖ్యత ఏమిటి? *

ఆ రాయి స్వర్గం నుండి పంపించబడిందని, అప్పుడు అది పాల కన్నా తెలుపు రంగులో ఉండేదని, మానవ జాతి మూల పురుషుడైన ఆదాము (ఆయనపై శాంతి కలుగు గాక) సంతానం యొక్క పాపాల వలన అది నల్లగా మారిందని (అంటే పాపాల ప్రభావం మన మనసులపై ఎలా ఉంటుందో తెలియజేయడానికి నిదర్శనంగా) ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) గారి ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. 

ముస్లిములు కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆచారం. నల్ల రాయి దగ్గర నుండి ప్రదక్షిణ మొదలయ్యి తిరిగి అక్కడకు చేరుకున్న తర్వాత పూర్తి అవుతుంది. ఈ విధంగా ప్రదక్షిణలను లెక్కించడానికే తప్ప ఆ రాయికి ఎటువంటి ఆరాధన జరుగదు. 

అయితే స్వర్గ లోక శిల అవడం వలన ప్రవక్త ముహమ్మద్ (స) దానిని ముద్దాడే వారు. దీనిని అనుకరిస్తూ కాబాను దర్శించినవారు కూడా అలా చేస్తారు. దీనికి ప్రామాణికత ప్రవక్త అనుచరులైన ఉమర్ (దైవం ఆయనను కరుణించుగాక) గారి ఉల్లేఖనం. ఆయన నల్ల రాయిని ముద్దాడుతూ ఇలా అన్నారని హదీసు గ్రంధాలలో నమోదయ్యింది – “నాకు తెలుసు, నువ్వు లాభాన్ని గాని నష్టాన్ని గాని కలింగించలేని ఒక రాయివి, ప్రవక్త నిన్ను ముద్దాడుతూ ఉండగా నేను చూసి ఉండకపోతే  నేను కూడా ఇలా చేసేవాడను కాను.”  ప్రజలు అజ్ఞానంతో ఆ రాయిని పవిత్రంగా భావించి ఆరాధించడం మొదలెడతారని ప్రవక్త అనుచరులు ఎంత జాగ్రత్త తీసుకునేవారో దీనిని బట్టి అర్థం అవుతుంది.

*మక్కాలో ఎటువంటి లింగము, శివలింగమూ లేవు *

ఈ విధంగా హజ్రె హస్వద్ లేక స్వర్గలోక శిల శివలింగం కాదు. ఇంకా, సాతానును రాళ్ళతో కొట్టే ప్రదేశంలో ఉండే ఒక రాయి యొక్క కొన్ని పాత ఫోటోలను చూపించి కూడా అది శివలింగమని హిందువులను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా కేవలం అబద్ధపు ప్రచారం మాత్రమే

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.