#నమాజు_చేస్తే_లాభాలు
ఉపవాసం, జకాత్ (విధిదానం), హజ్ తదితర ఆదేశాలన్నియూ ప్రవక్త భువిపై ఉండగా ఇవ్వబడ్డాయి,
కాని #నమాజ్ విషయానికొస్తే; అల్లాహ్ ప్రవక్తను దివిపైకి పిలుచుకొని గొప్ప బహుమానంగా ప్రసాదించాడు.
అందుకే #నమాజ్'కున్నంత ప్రాముఖ్యత, ఘనత మరే ఆరాధనకు లేదు, ఇది ప్రతి ముస్లింపై ఐదు వేళల్లో పాటించడం విధిగా ఉంది. #నమాజు లాభాలు ఇలా ఉన్నాయి:
👉 మస్జిద్ కు వెళ్ళే వ్యక్తి యొక్క జామిన్ అల్లాహ్ ఉన్నాడు. (అబూదావూద్ 2494).
👉మస్జిద్ కు వచ్చిపోయే ప్రతి అడుగుకు బదులు ఒక పుణ్యం పెరుగును, ఒక పాపం తరుగును, ఒక స్థానం రెట్టింపగును. (ముస్లిం 654).
👉#నమాజు చేసేవారికి తోడుగా అల్లాహ్ ఉన్నాడు. (సూర మాఇద 5:12).
👉#నమాజు చేసేవారికి అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాలు, మన్నింపు, గౌరవ ప్రదమైన ఆహారం ఉంది. (సూర అన్ ఫాల్ 8:3,4).
👉మస్జిద్ లో నమాజు స్థాపించేవారే సన్మార్గ భాగ్యులు. (తౌబా 9:18).
👉#నమాజు చేయువారికి ప్రళయదినాన ప్రవక్త తోడు ప్రాప్తియగును. (ముస్లిం 489).
👉#నమాజుకై మస్జిద్ కు వెళ్ళినప్పుడల్లా అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఏర్పాటు చేస్తాడు. (బుఖారి 662, ముస్లిం 669).
👉ఫర్జ్ #నమాజు కొరకు మస్జిద్ కు వెళ్ళినప్పుడల్లా హజ్ చేసినంత పుణ్యం, అదే చాష్త్ #నమాజ్ చేసినప్పుడల్లా ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది. (అబూ దావూద్ 558).
👉చీకటి వేళల్లో #నమాజుకై మస్జిద్ కు వెళ్ళే వారి కొరకు అల్లాహ్ ప్రళయదినాన సంపూర్ణ కాంతి ప్రసాదిస్తాడు. (అబూ దావూద్ 561).
👉#నమాజు సరియైన విధంగా చేయడం వల్ల మనిషి చెడు నడత, అశ్లీలత నుడిం దూరంగా ఉండ గలడు. (అన్ కబూత్ 45).
👉 సరియైన పద్ధతిలో #నమాజు చేస్తే మనిషిలోని దురాశ, అత్యాశ, కలవరం, పిసినారితనాలు దూరమవుతాయి. (మఆరిజ్ 19-21).
ఇంకా ఉన్నాయి....
#నమాజు_చేయకుంటే_శిక్షలు
#నమాజును స్థాపించని వారు ఎవరు?
ఇహపరాల్లో వారికి ఎలాంటి శిక్ష ఉంటుంది? సమాధిలో వారి గతి ఏమవుతుంది?
ఖుర్ఆన్ హదీసు ఆధారంగా సంక్షిప్త రూపంలో తెలుసుకుందాం.
1- #నమాజు చేయడంలో అశ్రద్ధ వహించేవారికి ‘వైల్’ ఉంది (మాఊన్ 4,5).
2- #నమాజులో బద్ధకం చేసేవారు అపమార్గంలో ఉన్నారు. (నిసా 141,142.
3- #నమాజులో సోమరితనం చూపేవారి వద్ద ఎంత ఆస్తి సంపద, ఆలుపిల్లలు ఉన్నా అవి వారికి ఓ శిక్ష లాంటివే. (తౌబా 54,55).
4- వేళ తప్పి తనిష్టాను సారం #నమాజు చేసిన వారి కొరకు ‘ఘయ్య్’ ఉంది (అంటే వినాశం, దుర్గతి, నరకంలోని ఓ గుండం).
5- ఇక పూర్తిగా #నమాజు చేయనివారి స్థానం నరకం. (ముద్ధస్సిర్ 42,43).
6- ఎవరి వ్యాపారం, వ్యవసాయం, సంతానం వారిని #నమాజు చేయనివ్వదో అలాంటి వారు మహానష్టంలో పడి ఉన్నారు. (మునాఫిఖూన్ 9).
7- #నమాజు విషయాన్ని ఎగితాళి చేసేవారు, పరిహసించేవారు బుద్ధిజ్ఞానాలకు అతిదూరం ఉన్నవారు. (మాఇద 58).
8- #నమాజు చేయనివారు ముష్రికులు (రూం 31).
9- ముస్లిం మరియు కాఫిర్ల మధ్యలో వ్యత్యాసం #నమాజు మానడమే. (ముస్లిం 82).
10- #నమాజు చేయని వారికి ప్రళయదినాన ఏలాంటి నిదర్శనం, కాంతి, మోక్షము ఉండదు, ఇంకా అతను ఖారూన్, హామాన్, ఫిర్ఔన్ మరియు ఉబయ్య్ బిన్ ఖలఫ్ లకు తోడుగా ఉంటాడు. (ముస్నద్ అహ్మద్ 11/141).
11- ప్రళయదినాన తొలి ప్రశ్న #నమాజు గురించే అగును. (అబూదావూద్ 864).
🙌 అల్లాహ్ సుబహానహు వత'ఆలా మనందరికీ సరైన సమయంలో #నమాజు చదివే మరియు సరైన విధంగా ఖురాన్ అర్ధం చేసుకునే సద్భుద్ధిని తద్వారా మన జీవితాలను #నమాజు ఖూరాన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ కు అనుగుణంగా మార్చుకునే హిదాయత్ ని ప్రసాదించాలని కోరుకుంటు. ఆమీన్.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.